rana: హాలీవుడ్ మూవీ కోసం రానాతో సంప్రదింపులు?

షార్ట్స్‌లో చూడండి
మొదటి నుంచి కూడా రానా విభిన్నమైన ... విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. కథ .. తన పాత్ర కొత్తగా వుంటే చాలు, ఇతర భాషా చిత్రాలలో చేయడానికి కూడా ఆయన ఎంతో ఆసక్తిని చూపుతాడు. ఈ కారణంగానే ఇప్పటికే ఆయన తెలుగుతో పాటు .. తమిళ .. హిందీ సినిమాలు కూడా చేసేశాడు. ప్రస్తుతం కూడా ఆయన ఒకటి రెండు బాలీవుడ్ సినిమాలతో బిజీగా వున్నాడు.

అలాంటి రానా .. ఒక హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం ఉందంటూ ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. ఒక హాలీవుడ్ మూవీలో ముఖ్యమైన పాత్రకి సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఆ సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. రానా ఓకే అంటే ఆయన ఆ సినిమాలో చేయడం ఖరారైపోతుందట. ఆ హాలీవుడ్ మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం వుంది.
Go Back to Shorts
rana

More Telugu News