'118' సినిమాలో హైలైట్ గా నిలిచే అంశం అదేనట!
- గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్
- థ్రిల్లింగ్ అంశాలతో సాగే కథ
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో అండర్ వాటర్ లో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరించారట. వెరైటీగా డిజైన్ చేసిన ఈ ఫైట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఉత్కంఠ భరితులను చేస్తూ సాగే ఈ యాక్షన్ సీన్ లో పాల్గొనడానికి కల్యాణ్ రామ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడట. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.