సినీ పరిశ్రమకు శుభవార్త.. సింగ్ విండోతో అన్ని అనుమతులు ఇచ్చేస్తామన్న కేంద్రం!
- సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందన్న గోయల్
- ఈ సౌకర్యం విదేశీయులకే ఉండేదని వ్యాఖ్య
- నిర్మాతలకు భారీగా నగదు, సమయం ఆదా
సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పైరసీ సమస్యను నిర్మూలించేందుకు సినిమాటోగ్రఫి చట్టంలో కీలక మార్పులు తీసుకొస్తామని గోయల్ తెలిపారు. బాలీవుడ్ సహా వేర్వేరు సినీ పరిశ్రమల వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తోందని వ్యాఖ్యానించారు. తాను ఇటీవల ఓ థియేటర్ లో ’యూరీ’ సినిమా చూశానని, అదే చిత్రాన్ని పైరసీలో చూస్తే మాత్రం ఆ కిక్కు దొరకదని గోయల్ స్పష్టం చేశారు. గతంలో సినిమా థియేటర్లపై 50 శాతం పన్ను భారం పడేదనీ, కానీ ఎన్డీయే ప్రభుత్వం దీన్ని 12 శాతానికి (జీఎస్టీ) తగ్గించిందన్నారు. కేంద్రం తాజా నిర్ణయం నేపథ్యంలో దేశంలోని సినిమా నిర్మాతలకు నగదు, సమయం భారీగా ఆదా కానున్నాయి.