కృష్ణానదిలో బోటులో చెలరేగిన మంటలు.. చంద్రబాబు నివాసానికి సమీపంలో ఘటన
- జెట్టీకి కట్టిన బోటు నుంచి మంటలు
- స్థానికుల కేకలతో నిర్వాహకులు అప్రమత్తం
- ఆకతాయిల పనేనని అనుమానం
ఈ బోటు రైడింగ్‌కు అనుమతి లేకపోవడంతో దీనిని కృష్ణానదిలో జెట్టీకి కట్టి ఉంచారు. చాంపియన్స్ యాచ్‌క్లబ్‌కు చెందిన క్రూయిజ్ బోటుగా అధికారులు దీనిని గుర్తించారు. ఆకతాయిల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రదేశం ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే ఉండడం గమనార్హం.