ఏపీ ప్రజలు అగ్నిగుండంలా రగులుతున్నారు.. బీజేపీ, వైసీపీలు మాడి మసైపోతాయ్!: మంత్రి నారాయణ హెచ్చరిక
- జగన్ ఏపీని మోదీకి తాకట్టు పెట్టారు
- బీజేపీ-వైసీపీ మధ్య లాలూచీ ఉంది
- నెల్లూరులో మాట్లాడిన టీడీపీ నేత
నెల్లూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ చేసిన ద్రోహంపై ఏపీ ప్రజలు అగ్నిగుండంలా రగిలిపోతున్నారని తెలిపారు. వైసీపీ, బీజేపీలు ఆ ఆగ్నిగుండంలో మాడి మసైపోవడం ఖాయమని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.