నాకు జన్మనిచ్చింది దాసరే.. భావోద్వేగానికి గురైన నటుడు మోహన్‌బాబు
- దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహన్‌బాబు
- మా కుటుంబం నెత్తిన పాలకొల్లు ప్రజలు పాలుపోశారు
- మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టం
దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహన్‌బాబు మాట్లాడుతూ.. తమ కుటుంబం నెత్తిన పాలుపోసింది పాలకొల్లు ప్రజలేనన్నారు. ఇక్కడి నుంచి వచ్చిన దాసరి వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. సగం అరిగిపోయిన చెప్పుల నుంచి షూస్ వేసుకునే అవకాశం కల్పించింది ఆయనేనన్నారు. తనలాగా ఎంతోమందిని సినీ రంగంలో నిలబెట్టిన మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు దక్కిన అదృష్టమని మోహన్‌బాబు పేర్కొన్నారు.