జగన్ పై దాడి కేసు.. ముగిసిన శ్రీనివాసరావు రిమాండ్.. కోర్టుకు తరలింపు!
- ఇప్పటికే చార్జిషీట్ దాఖలుచేసిన ఎన్ఐఏ
- జగన్ పై దాడికేసులో క్లారిటీ వచ్చే ఛాన్స్
- గతేడాది అక్టోబర్ 25న దాడిచేసిన నిందితుడు
మరోవైపు ఈ కేసులో ఎన్ఐఏ, సిట్ అధికారుల మధ్య వివాదం తేలేవరకూ విచారణను నిలిపివేయాలని నిందితుడి తరఫు న్యాయవాది సలీం కోర్టును కోరారు. గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు కోడికత్తితో జగన్ పై దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎడమ చేతికి లోతైన గాయం కావడంతో జగన్ హైదరాబాద్ లో చికిత్స చేయించుకున్నారు.