ఈసీ రజత్ కుమార్ పై అందరికీ అనుమానాలున్నాయి: కోదండరాం
- ప్రభుత్వ యంత్రాంగాన్ని టీఆర్ఎస్ సొంత పనులకు వాడుకుంటోంది
- టీఆర్ఎస్ కు ఓటు వేయాలంటూ అధికారులు డబ్బులు పంచారు
- ఈసీ రజత్ కుమార్ పై విచారణ జరిపించాలి
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వీవీప్యాట్లను తీసుకొచ్చారని... అభ్యర్థులకు అనుమానాలు ఉన్నచోట వాటి స్లిప్పులను లెక్కించాల్సి ఉందని... అయినా ఆ పని చేయలేదని కోదండరాం మండిపడ్డారు. ఈ విషయంలో ఈసీ రజత్ కుమార్ వ్యవహారశైలిపై అందరికీ అనుమానాలు ఉన్నాయని చెప్పారు. రజత్ కుమార్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కంచే చేను మేసినట్టుగా ఎన్నికల సంఘం ప్రవర్తించడం సరికాదని అన్నారు. ఎన్నికల సంఘంపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు గతంలో ఎన్నడూ రాలేదని చెప్పారు.