కైరా అద్వాని బాగా అప్సెట్ అయిందట
- తొలి సినిమాతో హిట్
- రెండవ సినిమాతో అప్సెట్
- సెట్స్ పై 'అర్జున్ రెడ్డి' రీమేక్
'వినయ విధేయ రామ' కూడా హిట్ అయితే తెలుగులో వరుస అవకాశాలు వస్తాయనీ .. అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోతానని కైరా అద్వాని ఆశించింది. నిజంగానే ఈ సినిమా హిట్ కొట్టేసి వుంటే ఆమె డిమాండ్ అమాంతంగా పెరిగిపోయేదే. కానీ అలా జరగలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పరాజయం పాలైంది. ఈ సినిమాపై తాను పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారి పోవడంతో కైరా అద్వాని బాగా అప్సెట్ అయిందట. అందుకే, తెలుగులో చేయబోయే తదుపరి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. హిందీలో ఆమె 'అర్జున్ రెడ్డి' రీమేక్ లో చేస్తోన్న సంగతి తెలిసిందే.