జోరు పెంచిన పవన్ కల్యాణ్.. నేడు పాడేరులో జనసేన బహిరంగ సభ!
- గిరిజన సమస్యలను ప్రస్తావించనున్న జనసేనాని
- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ నేతలతో భేటీ
- వామపక్షాలతో ఈ నెల 25న సమావేశం
అనంతరం రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నేతలతో పవన్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరుసటి రోజు అంటే ఈ నెల 25న విశాఖపట్నంలో వామపక్ష పార్టీల నేతలతో పవన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితో సమావేశమై రాబోయే ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు.