అమరావతికి ఇంకా తరలిరాని న్యాయ సంస్థలు.. కొరడా ఝుళిపించిన ఏపీ ప్రభుత్వం!
- జీతాలు నిలిపివేయాలని ఉత్తర్వుల జారీ
- జాబితాలో ఏజీ ఆఫీసు, లీగల్ సర్వీస్ అథారిటీ
- ఇప్పటికే అమరావతికి వచ్చిన హైకోర్టు
సొంత రాష్ట్రానికి తరలిరాని ఈ సంస్థల్లోని ఉద్యోగులకు వేతనాలను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పైన పేర్కొన్న సంస్థలతో పాటు సాధారణ పరిపాలన శాఖ, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ కేడెట్ కోర్, స్టేట్ ఆర్చీవ్స్ డిపార్ట్ మెంట్, పే అండ్ అకౌంట్స్ కు జీతాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది.