ధిక్కారంపై వేటు.. మేడా మల్లికార్జున రెడ్డిని సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు!
- చంద్రబాబుకు రాజంపేట నేతల ఫిర్యాదు
- పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
- తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధినేత
అధికార పార్టీలో ఉంటూ విపక్ష వైసీపీ నేతలతో రాసుకుపూసుకు తిరుగుతున్న విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అమరావతిలో ఈరోజు సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించినప్పటికీ రాకపోవడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. మేడాతో పాటు ఆయన అనుచరులను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.