devadas kanakala: సుమను చూడగానే నా కోడలైతే బాగుండునని అనుకున్నాను: దేవదాస్ కనకాల

  • సుమ చాలా తెలివైనది
  • ఒక రోజున సుమ ఫోన్ చేసింది
  • వాళ్ల తరఫు వాళ్లని ఒప్పించాము    

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో దేవదాస్ కనకాల మాట్లాడుతూ, తన కోడలు సుమను గురించి ప్రస్తావించారు. "సుమ 'మేఘమాల' సీరియల్ చేస్తున్న సమయంలో రాజీవ్ కనకాల కూడా అందులో ఒక చిన్న వేషం వేశాడు. ఆ అమ్మాయితో కలిసి పనిచేస్తున్నప్పుడు .. అరె .. ఈ పిల్ల చాలా తెలివైనదానిలా వుంది .. ఈ అమ్మాయి కోడలిగా మా ఇంటికి వస్తే ఎలా వుంటుంది? అనిపించింది.

రాజీవ్ కనకాల కంటే ముందు సుమ నా దృష్టిలో పడింది. ఆ తరువాత కొంతకాలానికి సుమ ఫోన్ చేసి, తాను .. రాజీవ్ కనకాల ప్రేమించుకున్నామనీ ..  పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నామని చెప్పింది. మీరంతా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను అంది. ఈ లోగా రాజీవ్ కనకాల .. వాళ్ల అమ్మకి ఈ విషయం చెప్పేశాడు. వాళ్లమ్మకి సుమ ఒక్కతే కూతురు .. ఆమెను ఒప్పించమని అన్నాను. ఆ తరువాత సుమ తరఫున వాళ్లని కూడా ఒప్పించి పెళ్లి జరిపించాము" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News