తెలంగాణ పంచాయతీ విచిత్రం... మరణించిన వ్యక్తికి ఓట్లేసి గెలిపించిన గ్రామస్థులు!
- మహబూబాబాద్ జిల్లా రాజతండాలో ఘటన
- ఆదివారం మరణించిన అభ్యర్థి భాస్కర్
- ఆయనకే మెజారిటీ ఓట్లేసిన ప్రజలు
అనారోగ్యం కారణంగా బానోతు భాస్కర్ ఆదివారం నాడు మరణించారు. ఆయన మృతి వార్త తెలుసుని గ్రామ ప్రజలంతా తరలివచ్చారు. ఆ మరుసటి రోజున పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భాస్కర్ కు 44 ఓట్లు, ప్రత్యర్థి శ్రీనివాస్ కు 25 ఓట్లు వచ్చాయి. దీంతో మరణాన్ని జయించలేకపోయిన భాస్కర్, ఎన్నికల్లో మాత్రం విజయం సాధించినట్లయింది.