మ్యాచ్ లో ఓడిపోయారట... ఆటగాళ్లకు గుండు గీయించిన బెంగాల్ కోచ్!
- 1-5 తేడాతో ఓడిపోయిన బెంగాల్ అండర్ 19 హాకీ జట్టు
- 16 మంది క్రీడాకారులకు గుండు గీయించిన కోచ్ ఆనంద్
- విచారణకు ఆదేశించిన బెంగాల్ హాకీ అసోసియేషన్
కాగా, జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా జబల్ పూర్ లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగగా, బెంగాల్ అండర్–19 జట్టు 1–5 తేడాతో నామ్ ధారి ఎలెవన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఆపై జట్టులో 18 మంది ఆటగాళ్లలో 16 మంది గుండుతో కనిపించారు. అయితే, తాను ఆగ్రహం వ్యక్తం చేసిన మాట వాస్తవమేగానీ, గుండు చేయించుకోవాలని ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని ఆనంద్ అంటుండటం గమనార్హం.