ఈవీఎం ఓటింగ్ విధానం ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారింది: సీఎం చంద్రబాబు

  • పేపర్ బ్యాలెట్ విధానం తీసుకురావాలి
  • అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవాలి
  • చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రి వర్గ సమావేశం
ఈవీఎం ఓటింగ్ విధానం ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈవీఎంలతో ఎన్నికల ఫలితాలు తారుమారు చేయవచ్చని నిపుణులు అంటున్నారని, ఎన్నికల ఫలితాల తారుమారు విషయం ఆందోళన కల్గిస్తోందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవాలని, పేపర్ బ్యాలెట్ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాగా, ఏపీ మంత్రి వర్గ సమావేశం చంద్రబాబు అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలోపలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.
Go Back to Shorts
EVM
voting
Chandrababu
Andhra Pradesh

More Telugu News