నితీశ్ జీ.. మా చేపలు, రొయ్యలపై నిషేధం ఎత్తివేయండి!: చంద్రబాబు లేఖ
- ఏపీ సముద్ర ఉత్పత్తుల్లో ఫార్మాలిన్ అవశేషాలు
- అలాంటివి ఏదీ లేదన్న చంద్రబాబు
- కావాలంటే తనిఖీలకు అధికారులను పంపాలని విజ్ఞప్తి
ఈ విషయమై చంద్రబాబు స్పందిస్తూ.. తమ ఉత్పత్తుల్లో ఫార్మాలిన్ వాడటం లేదని స్పష్టం చేశారు. రొయ్యలు, చేపల ఉత్పత్తుల తనిఖీల కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అవసరమైతే తనిఖీల కోసం బిహార్ నుంచి అధికారులను పంపాలని కోరారు. ఏపీ సముద్ర ఉత్పత్తులపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.