విదేశాల్లోని అమ్మాయిలంతా అఖిల్ నే చూశారు: హైపర్ ఆది
- ప్లే బాయ్ గా కనిపించనున్న అఖిల్
- పైకి అంతా అరవిందస్వాములే
- విదేశాల్లో ఎక్కువ షూటింగ్ జరిగింది
'మీలో ప్లే బాయ్స్ ఎంతమంది వున్నారు?' అంటూ స్టేజ్ పై నుంచి ఆది ప్రశ్నిస్తే, 'ఎవరూ లేరు' అంటూ అంతా అరిచారు. అంతా పైకి అరవిందస్వామిలా కనిపిస్తారుగానీ, లోపలంతా నిత్యానంద స్వాములే. మీలో ఎంతో మంది ప్లే బాయ్స్ వున్నారు .. వాళ్లందరికీ బాబాయ్ అఖిల్' అంటూ నవ్వులు పూయించాడు. 'ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో ఎక్కువగా జరిగింది. అక్కడ మేమంతా అమ్మాయిలను చూస్తుండేవాళ్లం. ఆ అమ్మాయిలంతా అఖిల్ ను చూస్తుండేవాళ్లు' అంటూ సందడి చేశాడు. ఆ సమయంలో అఖిల్ కూడా నవ్వుకోవడం కనిపించింది.