దిల్ రాజు మామూలు హిట్ కొట్టలేదు
- ఇటీవల థియేటర్లకు వచ్చిన 'ఎఫ్ 2'
- నైజామ్ లో 'ఫిదా' రికార్డుకి దగ్గరగా
- ఈ ఏడాది ఆరంభంలోనే అదిరిపోయే హిట్
దిల్ రాజు నిర్మించిన 'ఫిదా' నైజామ్ లో 18 కోట్ల వరకూ రాబట్టేసి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటికే 'ఎఫ్ 2' నైజామ్ లో 15 కోట్లకి పైగా వసూలు చేసేసింది. రేపో మాపో 'ఎఫ్ 2' ఆ రికార్డును క్రాస్ చేసే అవకాశాలు వున్నాయని అంటున్నారు. ఇక నైజామ్ మినహా చాలా ప్రాంతాల్లో ఈ సినిమా వసూళ్లు 'గీత గోవిందం' వసూళ్లను అధిగమించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మొత్తానికి దిల్ రాజు ఈ ఏడాది ఆరంభంలోనే మరిచిపోలేని హిట్ కొట్టారని ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు.