Andhra Pradesh: కృష్ణా జిల్లాలో కారు బీభత్సం.. పైకి దూసుకురావడంతో ఇద్దరి దుర్మరణం!

షార్ట్స్‌లో చూడండి
వేగంగా వెళుతున్న కారు టైర్ పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామం వద్ద వేగంగా వెళుతున్న కారు పంక్చరయింది. దీంతో వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో దానిపై వెళుతున్న మల్లారాపు నాగేశ్వరరావు, చల్లా సాంబశివరావు అంతెత్తున ఎగిరి పక్కన పడ్డారు.

స్థానికులు వీరిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Krishna District
Road Accident
car
2 dead

More Telugu News