Tollywood: ‘యాత్ర’ సినిమా అప్ డేట్.. తన పాత్రలో స్వయంగా కనిపించనున్న జగన్!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో వైఎస్ గా మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా, వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ తెలిసింది. మహి.వి.రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైఎస్ జగన్ నిజ జీవిత పాత్రలో కనిపించబోతున్నారని సినిమా వర్గాలు తెలిపాయి.

అలాగే ఈ సినిమాలో కాంగ్రెస్ నేత గౌరు చరితారెడ్డి పాత్రలో నటి అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున నందికొట్కూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసి చరితా రెడ్డి ఏ విధంగా గెలిచారు?  అప్పటి పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొన్నారు? కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె చేసిన కృషిని చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 8న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.
Go Back to Shorts
Tollywood
yatra
ys biopic

More Telugu News