తెరపైకి హీరో సూర్య తనయుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెరపైకి హీరో సూర్య తనయుడు

  • హీరోగా .. నిర్మాతగా సూర్య బిజీ
  • త్వరలో చిన్నపిల్లల సినిమా 
  • ప్రధాన పాత్రలో సూర్య తనయుడు 'దేవ్'  
ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా సూర్య వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సూర్య తనయుడు 'దేవ్' కూడా ఒక సినిమాలో చేయనున్నాడనే టాక్ కోలీవుడ్లో కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. అయితే ఇది గాలివార్త కాదని తెలుస్తోంది. 'దేవ్' నిజంగానే ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం.

మరికొన్ని నెలల్లో 'దేవ్' 9వ సంవత్సరంలోకి అడుగుపెడతాడు. ఆ మధ్య సూర్య తమిళంలో పిల్లల సినిమా ఒకటి నిర్మించాడు (తెలుగులో 'మేము'). ఆ సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదుగానీ, తమిళంలో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు అలాంటి సినిమానే మరొకటి నిర్మించడానికి సూర్య సన్నాహాలు చేస్తున్నాడట. ఈ సినిమాలో ఆయన తనయుడు 'దేవ్' కీలకమైన పాత్రలో కనిపించనున్నట్టు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సూర్య సన్నాహాలు చేస్తున్నాడట.
suraya
dev

More Telugu News