జగన్ పై దాడి కేసులో ముగిసిన ఎన్ఐఏ విచారణ

  • జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాస్
  • హైదరాబాదులో శ్రీనివాస్ ను విచారించిన ఎన్ఐఏ
  • రేపు విశాఖ కోర్టులో శ్రీనివాస్ ను ప్రవేశపెట్టనున్న అధికారులు
విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారించింది. ఆ తర్వాత కేసు విచారణ ఎన్ఐఏకు బదిలీ అయింది. ఈ నేపథ్యంలో, నిందితుడు శ్రీనివాస్ ను ఎన్ఐఏ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. హైదరాబాదులో ఉన్న ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో విచారణ జరిగింది. ఈరోజు విచారణ ముగిసింది. రేపు ఉదయం శ్రీనివాస్ ను విశాఖపట్నం కోర్టులో ఎన్ఐఏ అధికారులు హాజరుపరచనున్నారు. మరోవైపు, సంచలనం కోసమే దాడి చేసినట్టు విచారణలో శ్రీనివాస్ తెలిపినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
jagan
srinivas
nia

More Telugu News