Andhra Pradesh: చంద్రబాబుతో జేసీ సోదరుల భేటీ.. పవన్, అస్మిత్ లకు టికెట్ ఇవ్వడంపై చర్చ!

  • కుమారులను రంగంలోకి దించుతున్న జేసీ బ్రదర్స్
  • ఎన్నికల్లో తప్పుకుంటామని పరోక్ష సంకేతాలు
  • ఉండవల్లిలో సీఎంతో కీలక మంతనాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీడీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈరోజు బాబును కలుసుకున్న నేతలు జిల్లాలో పార్టీ పరిస్థితితో పాటు ఇతర రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు బదులుగా కుమారులు జేసీ పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను రంగంలోకి దించే విషయమై ముఖ్యమంత్రితో చర్చించినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమని హామీ ఇచ్చారో ఇంకా తెలియరాలేదు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతీ చౌదరి, ఎమ్మెల్సీ శమంతకమణి తనయుడు అశోక్‌, మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాం, నిమ్మల కిష్టప్ప తనయుడు శిరీశ్ తదితరులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోమని జేసీ సోదరులు గతంలో చాలాసార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

More Telugu News