మేకప్ లేకుండా కత్రినా కైఫ్ ఇలా..!
Add ap7am to your home Screen

మేకప్ లేకుండా కత్రినా కైఫ్ ఇలా..!

  • టాలీవుడ్ లో మల్లీశ్వరితో తెరంగేట్రం
  • బాంద్రా సమీపంలో కారులో మేకప్ లేకుండా
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
టాలీవుడ్ లో 'మల్లీశ్వరి'తో వెంకటేష్ తో కలిసి నటించి, ఆపై బాలయ్యతో 'అల్లరి పిడుగు' చిత్రంలో కనిపించి, బాలీవుడ్ కు వెళ్లిపోయి, టాప్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయిన కత్రినా కైఫ్, తాజాగా మేకప్ లేకుండా కెమెరా కంటికి చిక్కింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఆమె కారులో వెళుతూ కనిపించగా, పలువురు తమ కెమెరాలకు పని పెట్టారు. ఆపై వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె 'భారత్' అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక కత్రినా కైఫ్ మేకప్ లేకపోయినా అందంగానే కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Tollywood
Bollywood
Katrina Kaif
Without Makeup

More Telugu News