రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న '118' మూవీ
- కల్యాణ్ రామ్ హీరోగా '118'
- నాయికలుగా నివేద .. షాలినీ పాండే
- మార్చి 1వ తేదీన విడుదల
ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాను మార్చి 1వ తేదీన విడుదల చేయనున్నారు. కల్యాణ్ రామ్ ఆశిస్తున్నట్టుగా ఈ సినిమా అయినా ఆయనకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.