జగన్ తనతో పాటు తమనూ జైలుకు తీసుకెళతారని పెట్టుబడిదారుల భయం: సీఎం చంద్రబాబు
- ఒకవేళ వైసీపీ అధికారంలోకొస్తే పరిస్థితి అలా ఉంటుంది
- పెట్టుబడిదారులు కూడా తప్పించుకు పోతారు
- రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి కాకూడదు
చాలా మంది పారిశ్రామిక వేత్తలు తమ జీవితాలనే నాశనం చేసుకున్నారని, కొంత మంది అధికారులు వీళ్లు చెప్పిన మాటలు విని వాళ్లు కూడా జైలుకు పోయే పరిస్థితికి వచ్చిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీనే రావాలని ప్రజలు తమ సందేశాల ద్వారా తనకు తెలియజేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. నాశనమవుతున్న వ్యవస్థలను గాడిన పెట్టేందుకు, రాష్ట్రాభివృద్ధి జరగాలంటే ‘నేనే మళ్లీ రావాలి’ అని ప్రజలు తనకు మెస్సేజ్ లు పంపుతున్నారంటూ వాటిని చంద్రబాబు చదివి వినిపించారు. రాష్ట్రం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి కాకూడదంటే టీడీపీనే మళ్లీ అధికారంలోకి రావాలని, ఈ విషయమై ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు కోరారు.