ఇకపై రైలు బయలుదేరాక.. ఖాళీ ఉన్న బెర్తుల వివరాలు తెలుసుకోవచ్చు!
- హెచ్‌హెచ్‌టీ వ్యవస్థ అందుబాటులోకి
- రైలు కదిలాక రిజర్వేషన్‌పై ఆరా తీయొచ్చు
- దక్షిణ మధ్య రైల్వే ప్రయోగాత్మకంగా అమలు
డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా తొలిసారి ఈ వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వేలో డివిజినల్ రైల్వే మేనేజర్ అమిత్ పరదాన్ గురువారం ప్రారంభించారు. హెచ్‌హెచ్‌టీ పరికరాల ద్వారా రైలు ప్రయాణంలో టికెట్లను తనిఖీ చేయనున్నారు. దీంతో రిజర్వేషన్ చేయించుకునే ప్రయాణికుల వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు. ఆయా స్టేషన్ల మధ్య ఖాళీల వివరాలు అందుబాటులోకి వచ్చి వాటిని కేటాయించేందుకు సులభమవుతుంది. ఈ విధానాన్ని 51 రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలిసారి సికింద్రాబాద్ నుంచి వెళ్లే నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దీన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం సిబ్బందికి 40 హెచ్‌హెచ్‌టీ పరికరాలు అందించారు.