లోక్ సభలో టీడీపీ సభ్యుడు శివప్రసాద్ పై సస్పెన్షన్ వేటు!
- మరో ముగ్గురు అన్నాడీఎంకే సభ్యులపై వేటు
- టీడీపీ వైఖరిని తప్పుపట్టిన మంత్రి గోయల్
- ఆయన వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ సభ్యుల ఆందోళన
దీంతో కేంద్ర మంత్రి గోయల్ విమర్శలను నిరసిస్తూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వీరికి కావేరీ నదీ జలాల వివాదంపై ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే సభ్యులు తోడయ్యారు. టీడీపీ సభ్యుడు శివప్రసాద్, మరో ముగ్గురు అన్నాడీఎంకే సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ శివప్రసాద్ తో పాటు ముగ్గురు అన్నాడీఎంకే సభ్యులను సస్పెండ్ చేశారు.