Vijayawada: ఇదో రకం నిరసన: మోదీ, భార్య జశోదాల మాస్కులు ధరించిన ఇద్దరికి పెళ్లి చేసిన విజయవాడ ముస్లింలు!

  • ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన
  • పెళ్లి పెద్దలుగా ముస్లింలు
  • బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు
కేంద్రం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లుపై విజయవాడలో ముస్లింలు వినూత్నంగా నిరసన తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బిల్లును తీసుకొచ్చినా తమ సంప్రదాయాన్ని విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మోదీ.. ఆయన భార్య జశోదాబెన్ మాస్క్‌లు ధరించిన ఇద్దరికి పెళ్లి చేశారు. ఈ పెళ్లికి ముస్లింలు పెళ్లి పెద్దలుగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిజానికి 1968లో మోదీ-జశోదాబెన్‌ల వివాహం జరిగింది. అయితే, ఆ తర్వాత మోదీ రాజకీయాల్లో ఎదుగుతూ భార్యకు దూరంగా జరిగారు. జశోదా బెన్ ఉపాధ్యాయురాలిగా స్థిరపడ్డారు.
Vijayawada
Narendra Modi
Jasodaben
marriage
triple talaq

More Telugu News