సెన్సార్ పూర్తిచేసుకున్న 'వినయ విధేయ రామ'
- బోయపాటి నుంచి యాక్షన్ ఎంటర్టైనర్
- ప్రతినాయక పాత్రలో వివేక్ ఒబెరాయ్
- ముఖ్య పాత్రల్లో స్నేహ .. ప్రశాంత్
వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించగా, స్నేహ .. ప్రశాంత్ .. ఆర్యన్ రాజేశ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి ముందు చరణ్ చేసిన 'రంగస్థలం' సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. సంక్రాంతి బరిలో దిగుతోన్న ఈ సినిమా, తమ హీరోకి బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో చరణ్ అభిమానులు వున్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.