rajani: తెలుగులో 'పేట' విడుదలకి రంగం సిద్ధం

  • కార్తీక్ సుబ్బరాజ్ నుంచి రానున్న 'పేట'
  • రజనీ సరసన సిమ్రాన్ .. త్రిష 
  • జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు      

శంకర్ దర్శకత్వంలో రజనీ చేసిన '2.ఓ' సినిమాను మినహాయిస్తే, ఈ మధ్య కాలంలో ఆయన చేసిన 'కబాలి' .. 'కాలా' సినిమాలు మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసినవే. తాజాగా ఆయన చేసిన 'పేట' సినిమా కూడా మాస్ అంశాలతో నిర్మితమైనదే. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రజనీ లుక్ కి  విపరీతమైన క్రేజ్ వచ్చింది. దర్శకుడిగా కార్తిక్ సుబ్బరాజ్ కి గల ఇమేజ్ కూడా ఈ సినిమా పట్ల క్రేజ్ పెరగడానికి కారణమైంది. ఇక రజనీ సరసన సిమ్రాన్ .. త్రిష కనిపించనుండటం కూడా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి బరిలో ఈ సినిమా సందడి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి మరి.

More Telugu News