విజయ్ దేవరకొండకి నేనూ అభిమానినే: కైరా అద్వాని
- హిందీలో 'కబీర్ సింగ్' చేస్తున్నాను
- ఆ మధ్య 'అర్జున్ రెడ్డి' చూశాను
- ఇక్కడికి కొస్తే వాళ్లింటి భోజనమే చేస్తాను
తాజా ఇంటర్వ్యూలో కైరా అద్వాని మాట్లాడుతూ .. "నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం .. 'వినయ విధేయ రామ'లో నటనతో పాటు డాన్స్ కి అవకాశం వున్న పాత్ర లభించడం నా అదృష్టం. ప్రస్తుతం హిందీలో 'కబీర్ సింగ్' సినిమా చేస్తున్నాను .. ఇది 'అర్జున్ రెడ్డి'కి రీమేక్. 'కబీర్ సింగ్' సినిమా కోసమే నేను 'అర్జున్ రెడ్డి' చూశాను. అప్పటి నుంచి విజయ్ దేవరకొండకి అభిమానిగా మారిపోయాను. చాలామందికి లాగే నేను విజయ్ దేవరకొండకి పెద్ద ఫ్యాన్ ని. మహేశ్ .. చరణ్ లతో సినిమాలు చేయడం వలన వాళ్ల ఫ్యామిలీస్ తో బాగా పరిచయం ఏర్పడింది. హైదరాబాద్ లో షూటింగ్ ఉంటే, వాళ్ల ఇంటి భోజనమే చేస్తాను" అని చెప్పుకొచ్చింది.