Mahesh Babu: సుకుమార్ సినిమాకి డేట్స్ ఇచ్చేసిన మహేశ్ బాబు

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం మహేశ్ బాబు తన పూర్తి దృష్టి 'మహర్షి' పైనే పెట్టాడు. ఇది ఆయనకి 25వ సినిమా కావడం వలన, ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ ప్రాజెక్టు ఏప్రిల్లో పట్టాలెక్కనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కాస్త ఆలస్యంగా మే నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళుతున్నట్టుగా సమాచారం.

ముందుగా ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ ఆలోచనను విరమించుకున్నట్టుగా తెలుస్తోంది. మరో స్టార్ హీరోయిన్ ను తీసుకోనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మే నెలలో మహేశ్ బాబుతో సంబంధం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారని అంటున్నారు. జూన్ నుంచి మహేశ్ బాబు వరుసగా డేట్స్ ఇచ్చాడట. ఫారిన్లో జరిగే షూటింగులో ఆయన పాల్గొంటాడని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 
Go Back to Shorts
Mahesh Babu
sukumar

More Telugu News