Uttar Pradesh: యువతిపై సోదరులతో కలిసి గ్యాంగ్ రేప్.. వీడియో తీసి బెదిరింపులు!

  • ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో ఘటన
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
  • కేసు నమోదుచేసిన అధికారులు
స్నేహం పేరుతో ఓ యువతిని నమ్మించిన యువకుడు దారుణానికి తెగబడ్డాడు. యువతిని ఓ హోటల్ లో బంధించి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యాన్ని వీడియో తీసి తనను పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో చోటుచేసుకుంది.

షామ్లీ జిల్లాకు చెందిన సోనూ అనే యువకుడికి ఓ యువతి(23) ఫేస్ బుక్ లో పరిచయమైంది. పరిచయం పెరగడంతో ఇద్దరూ ఓ హోటల్ లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా అనుకున్నట్లు యువతి హోటల్ గదిలోకి రాగానే సోనూ తన సోదరులతో కలిసి ఆమెను బంధించాడు. అనంతరం వారితో కలిసి బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని స్మార్ట్ ఫోన్ లో చిత్రీకరించాడు.

అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని సోనూ ఆమెను డిమాండ్ చేశాడు. లేదంటే ఈ వీడియో వైరల్ గా మారుతుందని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Uttar Pradesh
rape
gang rape
brothers
sahmli
video
blackmail
Police
case registered

More Telugu News