మామతో వివాహేతర బంధం... చూసిందని కుమార్తె హత్య... ఆపై రైలుకిందపడి ఆత్మహత్య!

  • విజయవాడలో రైలు కిందపడ్డ ముగ్గురు
  • అంతకుముందే కుమార్తె హత్య  
  • కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన వివాహేతర బంధం
కట్టుకున్న భర్త పెదనాన్నతో పెట్టుకున్న వివాహేతర బంధం ఆ యువతి కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసి, నలుగురి ప్రాణాలను బలిగొంది. విజయవాడలో తీవ్ర కలకలం రేపిన ఈ కేసులో పోలీసులు మరిన్ని వివరాలను వెల్లడించారు. తమిళనాడులోని వేలూరు జిల్లా నెలవాయి గ్రామానికి చెందిన ధనశేఖర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ, భార్య జయంతి, పిల్లలు మహాలక్ష్మి, శ్రీలక్షితో కలిసివుంటున్నాడు.

ఇదిలా వుండగా, ధనశేఖర్ పెదనాన్న గోపాలకృష్ణన్ కు, జయంతికి మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. ఈ క్రమంలో గత నెల 22న తన ఇద్దరు పిల్లలనూ తీసుకుని గోపాలకృష్ణన్ తో పారిపోయిన జయంతి, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తిరిగింది. ఈ క్రమంలో ఏకాంతంగా ఉన్న వారిని పెద్ద కుమార్తె మహాలక్ష్మి చూడటంతో, ఎక్కడ తమ గుట్టు బయట పడుతుందోనన్న భయంతో వేళాంగిణిలోని హోటల్ గదిలో ఆమెను ఇద్దరూ కలసి చంపేశారు.

ఇదే సమయంలో తన భార్య, బిడ్డలు కనిపించకపోవడంతో ధనశేఖర్, పోలీసులను ఆశ్రయించి గోపాలకృష్ణన్ పై కిడ్నాప్ కేసు పెట్టాడు. ఈ కేసును పోలీసులు విచారిస్తున్న క్రమంలోనే మహాలక్ష్మి హత్య విషయం బయటకు వచ్చింది. పోలీసులు తమను అరెస్ట్ చేయడానికి వస్తున్నారన్న భయంతో మరో బిడ్డ శ్రీలక్ష్మి, మామ గోపాలకృష్ణన్ సహా జయంతి విజయవాడకు వచ్చి ముగ్గురూ కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Vijayawada
Murder
Sucide
Police

More Telugu News