అగ్రిగోల్డ్ ఆస్తులను చవగ్గా కొట్టేసేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారు! ఆళ్ల నాని
- బాధితులను ఆదుకోవాలన్న ధ్యాస ప్రభుత్వానికి లేదు
- వెంటనే రూ.1,100 కోట్లు విడుదల చేయండి
- ఏలూరులో ఆందోళన చేపట్టిన వైసీపీ
ఏలూరులోని కలెక్టరేట్ వద్ద ఈరోజు వైసీపీ శ్రేణులతో కలిసి అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా నాని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ వైసీపీ పోరాడుతుందనీ, అండగా ఉంటుందని వ్యాఖ్యానించారు.