sensex: అమ్మకాల ఒత్తిడి.. భారీగా నష్టపోయిన మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ ఉదయం  ఫ్లాట్ గా సూచీలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మెటల్స్, ఆటోమొబైల్, బ్యాంకింగ్ తదితర సెక్టార్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో... భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 377 పాయింట్లు పతనమై 35,513కు పడిపోయింది. నిఫ్టీ 120 పాయింట్లు నష్టపోయి 10,672కు దిగజారింది.

యాక్సిస్ బ్యాంక్, వేదాంత, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ, ఐషర్ మోటార్స్, హెచ్పీసీఎల్, ఓఎన్జీసీ తదితర స్టాకులు నష్టపోయాయి. బజాజ్ ఆటో, హెచ్సీఎల్, ఏషియన్ పెయింట్స్, భారతి ఇన్ఫ్రాటెల్, భారతి ఎయిర్ టెల్ తదితర కంపెనీలు లాభపడ్డాయి.
Go Back to Shorts
sensex
nifty
stock market

More Telugu News