రామ్ గోపాల్ వర్మపై విరుచుకుపడ్డ నాదెండ్ల భాస్కరరావు
- ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది నేనా? లేక అతని కుటుంబసభ్యులా?
- వర్మ పెద్ద మనిషి అని ఇన్నాళ్లు అనుకున్నా
- నిజాలు తెలుసుకుని మాట్లాడాలి
సినిమాల్లో ఊహాగానాలు ఉంటాయని, కానీ వాస్తవ ప్రపంచంలో ఊహాగానాలకు తావు ఉండదని నాదెండ్ల తెలిపారు. 'కీలుగుర్రం' సినిమాలో మబ్బుల్లోంచి నాగేశ్వరరావు గుర్రం ఎక్కి వస్తారని... నిజంగానే ఆయన గుర్రం ఎక్కి వస్తారేమోనని తాను అనుకునేవాడినని... వర్మ మాటలు కూడా అలాగే ఉన్నాయని చెప్పారు. వర్మ నిజాలు తెలుసుకోవాలని... వెన్నుపోటు పొడిచేది ఎవరో గ్రహించాలని తెలిపారు. పవన్, మనోహర్ ఇద్దరూ పిల్లలని... వారి పని వారు చేసుకుంటున్నారని... వారితో తనను ముడిపెట్టి మాట్లాడటం సరికాదని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది నేనా? లేక అతని కుటుంబసభ్యులా? అని ప్రశ్నించారు.