బన్నీకి హీరోయిన్ దొరికేసినట్టే!
- 'భరత్ అనే నేను'తో పరిచయం
- యూత్ లో విపరీతమైన క్రేజ్
- వచ్చేనెలలో సెట్స్ పైకి
ఈ నేపథ్యంలో కైరా అద్వాని పేరు తెరపైకి వచ్చింది. కథానాయిక పాత్ర కోసం ఈ సినిమా టీమ్ ఆమెతో సంప్రదింపులు జరుపుతోందట. బన్నీ జోడీగా ఛాన్స్ అంటే ఆమె కాదనే అవకాశం ఉండదు కనుక, ఆమె ఎంపిక ఖరారైపోయినట్టేనని చెప్పుకుంటున్నారు. 'భరత్ అనే నేను' తో తెలుగు తెరకి పరిచయమైన ఈ సుందరి, త్వరలో 'వినయ విధేయ రామ' సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. వచ్చేనెలలో బన్నీతో కలిసి సెట్స్ పైకి వెళ్లనుంది.