'మిస్టర్ మజ్ను' టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్
- అఖిల్ మూడవ చిత్రంగా 'మిస్టర్ మజ్ను'
- యూత్ ను ఆకట్టుకున్న టీజర్
- జనవరి 25వ తేదీన విడుదల
ఒక్క రాత్రిలోనే ఈ సినిమా టీజర్ 2 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అందుకు సంతోషిస్తూ ఈ సినిమా టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. జనవరి 25వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. అఖిల్ గత రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో, ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలని అభిమానులు భావిస్తున్నారు.