ర్యాంబో లుక్ కోసం చరణ్ ఎంతో కష్టపడ్డాడట!
- కండలు తిరిగిన దేహంతో చరణ్
- రోజుకి 4 గంటలపాటు జిమ్ లోనే
- బాలీవుడ్ హీరోలే స్ఫూర్తి
ఇలా కండలు తిరిగి కనిపించడం కోసం ఆయన ప్రతిరోజు 4 గంటలపాటు జిమ్ లో కసరత్తు చేశాడని అంటున్నారు. ఇంట్లోనే జిమ్ ఉండటంతో, ఆహార నియమాలు పాటిస్తూ మంచి కోచ్ పర్యవేక్షణలో చరణ్ ఎంతో శ్రమించాడని చెబుతున్నారు. చరణ్ లుక్ చూస్తుంటే .. మాస్ ఆడియన్స్ కి యాక్షన్ సీన్స్ తో ఆయన పండగ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక మరో వైపున సంప్రదాయ బద్ధమైన వస్త్రధారణతోను ఆయన పోస్టర్స్ లో కనిపిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించనున్నాడు.