ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.. ఇప్పుడు మంచానికే పరిమితమయ్యాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.. ఇప్పుడు మంచానికే పరిమితమయ్యాడు!

  • వాంగ్‌కు ఐఫోన్ ఒక కల
  • ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే
  • 3,200 డాలర్లకు కిడ్నీ అమ్ముకున్నాడు
ప్రతి ఒక్కరికీ ఐఫోన్ అనేది ఒక కల... అదొక స్టేటస్ సింబల్.. అందుకే దీనికోసం ఓ యువకుడు ఏకంగా తన కిడ్నీనే అమ్ముకున్నాడు. తరువాత విషయం తెలిసి షాక్ అవడమే కాదు... జీవితాంతం మంచానికే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. చైనాకు చెందిన వాంగ్ అనే యువకుడు ఐఫోన్ కొనుక్కోవాలని కలలు కన్నాడు.

అయితే అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో దాని కోసం ఏకంగా తన కిడ్నీని 3,200 డాలర్లకు అమ్ముకున్నాడు. వచ్చిన డబ్బుతో ఐఫోన్ కొనుక్కుని మిగిలిన డబ్బుతో ఎంజాయ్ చేశాడు. అయితే కిడ్నీ మార్పిడి కోసం చేసిన శస్త్ర చికిత్స కొన్నాళ్లకు వికటించడంతో ఇన్ఫెక్షన్ కారణంగా రెండో కిడ్నీ కూడా పాడైంది. ఏడాది కాలంగా వాంగ్ తల్లిదండ్రులు అతని డయాలసిస్ కోసం చాలా కష్టపడుతున్నారు.
China
Wang
I Phone
Kidney
Infection

More Telugu News