బులంద్‌షహర్ ఘర్షణలలో ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్!
- ఆవుల వధింపుపై నిరసనలు
- సుబోధ్‌ను గొడ్డలితో నరికిన కల్వా
- కాల్పులతో హత్య చేసిన ప్రశాంత్
అల్లర్ల సమయంలో సుబోధ్‌పై కల్వా గొడ్డలితో దాడి చేశాడు. ఆ తర్వాత ఆయన చేతి వేళ్లను నరికేందుకు యత్నించాడు. ఆ తర్వాత ప్రశాంత్ నట్ అనే వ్యక్తి సుబోధ్‌పై కాల్పులు జరిపి హత్య చేసినట్టు తేలింది. ప్రశాంత్‌ను డిసెంబర్ 28నే అదుపులోకి తీసుకున్నారు. సుబోధ్‌పై దాడి చేసేందుకు ఉపయోగించిన గొడ్డలిని కూడా స్వాధీనం చేసుకున్నారు.