సొంతగూటికి చేరిన గుర్నాథ్ రెడ్డి.. కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన జగన్!
- నిన్న టీడీపీకి గుడ్ బై చెప్పిన గుర్నాథ్ రెడ్డి
- పలాస నియోజకవర్గంలో జగన్ తో భేటీ
- ఏడాది క్రితం టీడీపీలో చేరిన నేత
కాగా, జగన్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని గుర్నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. 2014 ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు. గతేడాది టీడీపీలో చేరిన గుర్నాథ్ రెడ్డి.. తాజాగా తిరిగి సొంతగూటికి చేరారు.