బీరు తాగుతూ బస్సు దిగిన రవిశాస్త్రి.. వీడియో వైరల్!
- మూడో టెస్టులో భారత్ ఘన విజయం
- హోటల్ వద్ద భారత్ ఆర్మీ సాదర స్వాగతం
- కామెంట్స్‌తో హోరెత్తిస్తున్న అభిమానులు
భారత జట్టుకు అధికారికంగా మద్దతు ఇచ్చే భారత్ ఆర్మీ సభ్యులు హోటల్ వద్ద భారత జట్టుకు సాదర స్వాగతం పలికారు. బస్సు నుంచి సభ్యులు ఒక్కొక్కరుగా కిందికి దిగారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం బీరు తాగుతూ కిందికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత్ ఆర్మీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియోపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.