శ్రీరాముడికి కూడా ఓ ఇల్లు ఇవ్వండి.. రామమందిరం ఆలస్యంపై బీజేపీ నేత వినూత్న నిరసన!
- అయోధ్య కలెక్టర్ కు ఎంపీ రాజ్ భర్ లేఖ
- రాముడు టెంట్ లో ఉంటున్నాడని వెల్లడి
- వెంటనే ఇంటిని కేటాయించాలని లేఖ
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని ప్రతీ ఒక్కరికి ఇంటిని నిర్మిస్తామని కేంద్రం చెబుతోందని రాజ్ భర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో శ్రీరాముడికి కూడా ఇల్లు లేదనీ, ఆయనకు ఓ ఇంటిని కేటాయించాలని అధికారులను కోరారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి రామమందిరాన్ని నిర్మించాలని హిందూ సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంటే.. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పు వచ్చేవరకూ ఆగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.