ఇద్దరు రైల్వే ఉద్యోగులను బలిగొన్న కావేరీ ఎక్స్ ప్రెస్!
- కర్ణాటకలోని వరదాపురం వద్ద ఘటన
- పట్టాలను తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన కావేరీ ఎక్స్ ప్రెస్
- రైలును గమనించనందునే ప్రమాదమన్న అధికారులు
వీరిలో ఒకరు శాంతిపురం మండలానికి చెందగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తని అధికారులు తెలిపారు. రైలు వస్తున్న విషయాన్ని వీరిద్దరూ గమనించనందునే ప్రమాదం జరిగిందని తేల్చిన అధికారులు, నిబంధనల ప్రకారం వారి కుటుంబాలకు పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.