Chandrababu: ప్రధానికి స్వాగతం పలకబోను... అదే పెద్ద నిరసన: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
వచ్చే నెల 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మోదీ పర్యటనకు గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్న ఆయన, అదే పెద్ద నిరసనని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, గుంటూరులో మోదీ సభకు తెలుగు ప్రజలు ఎవరూ హాజరు కారాదని అన్నారు.

ప్రధాని గుంటూరు పర్యటనకు ప్రభుత్వం దూరంగా ఉంటుందని వ్యాఖ్యానించిన ఆయన, అది పార్టీ కార్యక్రమమేనని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఎవరూ మోదీ సభకు వెళ్లకుంటే, అది ఓ పెద్ద గుణపాఠం అవుతుందని, ప్రజల సెంటిమెంట్ ఎలా ఉందన్న విషయం మోదీకి స్పష్టమవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జనవరి 1న బీజేపీకి వ్యతిరేకంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో శాంతియుత నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు సూచించారు.
Go Back to Shorts
Chandrababu
Narendra Modi
Andhra Pradesh
Protest

More Telugu News