ప్రభాస్ గెస్ట్ హౌస్ స్థలంపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదిక!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ గెస్ట్ హౌస్ స్థలంపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదిక!

  • రాయదుర్గం పాన్ మక్తా భూముల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్
  • గత వారంలో సీజ్ చేసిన అధికారులు
  • స్టే కోరిన ప్రభాస్ పిటిషన్ పై నేడు విచారణ
హైదరాబాద్, శేరిలింగంపల్లి సమీపంలోని రాయదుర్గం పాన్ మక్తా భూముల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ ఉందని చెబుతూ, దాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేయగా, స్టే కోరుతూ దాఖలైన పిటిషన్ పై నేడు మరోమారు విచారణ జరగనుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నివేదికను సోమవారం నాడు సమర్పించాలని గత వారం ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో, అధికారులు రిపోర్టును తయారు చేశారు. నేడు ప్రభుత్వ నివేదికలోని అంశాల ఆధారంగా, ప్రభాస్ గెస్ట్ హౌస్ ను సీజ్ నుంచి విడిపించాలా? విచారణ పూర్తి అయ్యేవరకూ యథాతథ స్థితిని కొనసాగించాలా అన్న విషయమై కోర్టు తన నిర్ణయం ప్రకటిస్తుందని సమాచారం. మరికాసేపట్లో దీనిపై కోర్టులో విచారణ జరగనుంది.
Prabhas
Land
Guest House
High Court

More Telugu News